గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సామజిక మాధ్యమాల్లోనూ నటి శ్రీరెడ్డి సంచలనంగా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అంతే ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో కాక రేపుతున్నాయి. తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ లో జరుగుతున్న దారుణాలు గురించి శ్రీరెడ్డి మాట్లాడుతోంది. తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది. 'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.
చెప్పడమే కాకుండా, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపింది. తనకి 'మా' సభ్యత్వం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు అని అలాగే తెలుగు చిత్రపరిశ్రమలో 75 % తెలుగు హీరోయిన్లకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆమె ఈ నిరసన తెలిపినట్టు సమాచారం. ఇది జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెని జూబిలీహిల్స్ పొలిసు స్టేషన్ కి తరలించారు.