ఎందరో ప్రముఖుల వారసులు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వారిలో హీరోలున్నారు. హీరోయిన్లున్నారు. హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ హీరోయిన్స్‌గా సినీ ప్రముఖులు తమ కూతుళ్లను ఇండస్ట్రీలోకి పంపించడమే పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశం. ఆ కోవలో బాలీవుడ్‌లో పలువురు సీనియర్ హీరోలు తమ కూతుళ్లను హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఈ జనరేషన్ హీరోయిన్లుగా వారు సత్తా చాటుతున్నారు.
అలాగే కోలీవుడ్, టాలీవుడ్‌ని కూడా తీసుకుంటే, విశ్వనటుడు కమల్ తనయులైన శృతిహాసన్, అక్షరా హాసన్ మొదలుకొని చాలా మంది ముద్దుగుమ్మలు సీనియర్ హీరోల వారసురాళ్లుగా యాక్టింగ్‌లో టాలెంట్ చూపిస్తున్నారు. తెలుగులో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారిక తనదైన శైలిలో హీరోయిన్‌గా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అసలింతకీ ఇదంతా ఎందుకంటే, ఈ మధ్య ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో పలువురు కాస్టింగ్ కౌచ్ గురించి తమ అనుభవాలను చెప్పుకున్నారు. తాజాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో హీరోగా సత్తా చాటి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు కమ్ విలన్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్న సీనియర్ హీరో అర్జున్ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు.'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ హండ్రెడ్ పర్సంట్ ఉంది.
కానీ ఇండస్ట్రీలోనే ఉంటూ ఆ ఇండస్ట్రీని నేనే నమ్మకపోతే .. అది న్యాయం కాదు. నా కూతురు ఐశ్వర్య కూడా ఇండస్ట్రీలోనే ఉంది. ఆమెను నేను ఆపలేను. కానీ అలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొని నిలబడాలో నా కూతురుకి తెలుసు. ఆమెపై పూర్తి నమ్మకం ఉంది..' నాకు అని ఆయన అన్నారు.