నితిన్ కోసం ఇద్దరి భామల పోటీ?

మరిన్ని వార్తలు

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి  దూసుకు వచ్చిన కన్నడ కస్తూరి శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వం లో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అందం అభినయం, డాన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించి, వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. గత ఏడాది వరకు అందరి హీరోలకి , ప్రొడ్యూసర్స్ కి మొదటి ఛాయిస్ శ్రీలీల ఉండేది. వరస ఫ్లాప్ లతో డీలా పడింది. అవకాశాలు తగ్గాయి. గౌతమ్ తిన్ననూరి సినిమాలో విజయ్ దేవర కొండ పక్కన మొదట శ్రీలీల ఫిక్స్ అయినా తరవాత తప్పించారు. కెరియర్ మొదట్లో స్టార్ హీరోయిన్స్ ని శ్రీలీల రీప్లేస్ చేసింది. ఇప్పుడు శ్రీలీలని తొలగిస్తున్నారు. 


ఈ నేపథ్యంలోనే సినిమాలకి బ్రేక్ ఇచ్చి స్టడీస్ మీద ఫోకస్ చేసే పనిలో ఉందట ఈ అమ్మడు. అందుకనే కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల  ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తోంది. అది కూడా పాత ప్రాజెక్ట్. ఇప్పుడు నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న 'రాబిన్ హుడ్' మూవీలో శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది కూడా డౌటే అని తెలుస్తోంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కలిసి ఇది వరకే 'భీష్మ' చేసి సక్సెస్ అందుకున్న కారణంగా ఈ మూవీలో మొదట రష్మికని అనుకున్నారు. తరవాత ఎందుకనో రష్మికని తప్పించి శ్రీలీలకి ఛాన్స్ ఇచ్చారు. నితిన్ తో కలిసి శ్రీలీల ఎక్స్ ట్రార్డనరీ చేసింది. ఇది డిజాస్టర్ కావటంతో, నిర్మాతలు మళ్ళీ ఇప్పుడు మనసుమార్చుకుని  ప్రజంట్ ఫామ్ లో ఉన్న రాశి ఖన్నాని ఫిక్స్ చేసినట్టు సమాచారం. 


రాశిఖన్నా ఈ మధ్య బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది. రుధ్ర, ఫర్జీ, లాంటి వెబ్ సిరీస్ లతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి 'యోధా' సినిమాతో అలరించింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే నితిన్ రాబిన్ హుడ్ మూవీ .  ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ మూవీలో శ్రీలీలే హీరోయిన్ అని, ఒక వేళ రాశి సెకండ్ హీరోయిన్గా ఎంపిక య్యిందేమో అని గుస గుసలు వినిపిస్తున్నాయి.  మొత్తానికి రాబిన్ హుడ్ లో రాశిఖన్నా నా, శ్రీలీల ఎవరన్నది తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS