రష్మి దేశాయ్.. ఇప్పుడు ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ రియాల్టీ షోతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ అందాల భామ, ప్రస్తుతం ‘నాగిని-4’ సీరియల్‌తో హల్‌చల్ చేసేస్తోంది. రష్మికి లక్షలాది మంది ఫాలోవర్స్ వున్నారంటే అదంతా బిగ్ బాస్ రియాల్టీ షో పుణ్యమే. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో ఆమెకు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది మరి.
బిగ్ బాస్ కారణంగా ఫాలోయింగ్ పెంచుకున్న ఫిమేల్ పార్టిసిపెంట్స్‌లో నార్త్ నుంచి రష్మి దేశాయ్, సౌత్ నుంచి లోస్లియా పేర్లు ప్రముఖంగా విన్పిస్తాయి. ఇక, పై ఫొటో విషయానికొస్తే.. సెల్ఫ్ క్వారంటీన్ లైఫ్ గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఈ ఫొటోని పోస్ట్ చేసింది రష్మి దేశాయ్. శారీరక అందం కంటే మానసిక అందమే గొప్పదని ఈ బ్యూటీ చెబుతోందిగానీ.. ఆ శరీరక అందంతోనే ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు వచ్చి పడ్తున్నాయని చెప్పడానికి ఈ ఫొటో కంటే నిదర్శనం ఇంకేం కావాలి.?