సెలబ్రిటీల డ్రస్సింగ్ విషయంలో సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కౌంటర్స్ పడుతూనే ఉంటాయి. కానీ, ఒక్కోసారి అవి శృతిమించుతుంటాయి. సెలబ్రిటీలను ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. అలా లేటెస్ట్గా బుల్లితెర హాటెస్ట్ యాంకర్ రష్మి కోపానికి కారణమయ్యాడు ఓ నెటిజన్. ఇంతకీ ఆ నెటిజన్ రష్మిని ఏమని కామెంట్ చేశాడు.? అంటే, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా, బుల్లితెరపై రష్మి చేస్తున్న గ్లామర్ షోనే ఎక్కువ ప్రమాదకరమని ఆ నెటిజన్ కామెంట్ చేశాడు. సదరు నెటిజన్‌కి రష్మి కూడా గట్టిగానే రీ కౌంటర్ ఇచ్చింది.
Since I choose not to address them directly pic.twitter.com/pWa5WSWUS0
— rashmi gautam (@rashmigautam27) March 17, 2020
‘నువ్వు చూడకపోతే, కళ్లు మూసుకో. నిన్నేమీ కాళ్లూ, చేతులూ కట్టేసి టీవీ ముందు కూర్చోబెట్టలేదు కదా.. నచ్చిన వాళ్లే చూస్తారు.. ’ అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యింది. రష్మి కౌంటర్‌ని చాలా మంది స్వాగతిస్తున్నారు. అంతే, గ్లామర్ అనేది ఓ కళ. ఆ కళను ఆస్వాదించాలంటే అవతలి వ్యక్తికి కూడా కూసింత కళాపోషణ ఉండాల్సిందే. పాపం ఈ నెటిజన్ ఎవరో కానీ, ఆ కళాపోషణ వేపగింజంతైనా ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే రష్మితో అలా అక్షంతలు వేయించుకున్నాడు. భళా రష్మి భళా.