వెబ్ సిరీస్ల జోరు ఉదృతంగా ఉంది. సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్లను రూపొందిస్తున్నారు. స్టార్లు కూడా ఇందులో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సమంత ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ ఒప్పుకుంది. ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత కనిపించనుంది. ఇప్పుడు అదే బాటలో తమన్నా కూడా నడవబోతోంది. అవును.. త్వరలోనే ఓ తమిళ వెబ్ సిరీస్లో తమన్నా నటించనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయిపోయాయి.
ఈ వెబ్ సిరీస్లో నటిస్తున్నందుకు గానూ తమన్నాకు కనీ వినీ ఎరుగని పారితోషికాన్ని అందిస్తున్నారని సమాచారం. లస్ట్ స్టోరీస్ తరహాలో సాగే ఈ వెబ్ సిరీస్లో బోల్డ్ కంటెంట్ కూడా చాలా ఉంటుందట. మరి అలాంటి సన్నివేశాన్ని తమన్నా ఏమేరకు రక్తి కట్టిస్తుందో చూడాలి. తమన్నా, సమంతలాంటి స్టార్లు వెబ్ సిరీస్లోకి అడుగుపెట్టారంటే.. మిగిలినవాళ్లంతా ఇటువైపు దృష్టి పెట్టడానికి ఎంతో సమయం అవసరం లేదు.