మెగా ఆఫ‌ర్ ప‌ట్టేసిందిగా!

By Gowthami - November 24, 2021 - 13:07 PM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర దొరికినా స‌రిపోతుంది. అది వాళ్ల కెరీర్‌కి ట‌ర్నింగ్ పాయింట్ అయిపోతుంది. ఇప్ప‌టికీ.. ప‌రిశ్ర‌మ‌లో ఇదే సెంటిమెంట్ బ‌లంగా కొన‌సాగుతోంది. ఇప్పుడు ఆ గోల్డెన్ ఛాన్స్‌.. జ‌బ‌ర్‌ద‌స్త్ ర‌ష్మికి ద‌క్కింది. చిరు న‌టిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. లో బుల్లితెర క్రేజీ యాంకర్, రష్మీ గౌతమ్ క‌నిపించ‌నుంద‌ట‌. అది కూడా ఓ గ‌రమ్ గ‌ర‌మ్ పాట‌లో. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇది. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కీర్తి సురేష్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఓ ఐటెమ్ పాట‌లో ర‌ష్మితో పాటు మ‌రో హాట్ భామ క‌నిపించ‌బోతోంద‌ట‌.

 

శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ మాస్ సాంగ్ త్వ‌ర‌లోనే తెర‌కెక్కించ‌నున్నారు. చిరు ప్రస్తుతం ఈ సాంగ్ రిహార్సల్ చేస్తున్నారట. అయితే, ఇది ఓ మాస్ సాంగ్ అని.. ఆ సాంగ్‌లో మెగాస్టార్‌తో కలిసి యాంకర్ కమ్ నటి రష్మీ గౌతమ్ స్టెప్పులేయనుందని సమాచారం. ఈ పాట‌తో రష్మి కెరీర్ ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS