బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది అందాల భామ రష్మీ గౌతమ్. వెండితెరపై హీరోయిన్‌గా మెరవాలన్న తన కోరికను కూడా తీర్చుకుంది. కానీ, ఆశించిన స్థాయిలో మెరవలేకపోయింది. హారర్ మూవీస్‌కి బ్రాండ్ అంబాసిడర్ అనే ముద్ర మాత్రమే వేయించుకుంది. 'గుంటూర్ టాకీస్' సినిమాలో లీడ్ రోల్ పోషించి, బోల్డ్ క్యారెక్టర్స్‌కి రష్మీ సై అంటే సై అని నిరూపించుకున్నా, అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రంగానే నిలిచాయి వెండితెరపై. కానీ, ఎప్పటికప్పుడే రష్మీ వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, తాజాగా రష్మీ ఆ ప్రయత్నాల్ని కాసేపు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వెలగాలనుకుంటోందట. ఆ క్రమంలో లస్ట్ స్టోరీస్ తరహాలో ఓ ఆఫర్ వచ్చిందట. ఆ సిరీస్ కోసం రష్మీ లెస్బియన్ అవతారమెత్తబోతోందట. ఇదే ఇప్పుడు సోషల్ హాట్ టాపిక్. 'భరత్ అనే నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయ్యే కళలున్న సమయానికి బాలీవుడ్‌కెళ్లి, అక్కడ ఓ రేంజ్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్న కైరా అద్వానీ, రష్మీలాంటి వారికి ఆదర్శంగా నిలిచింది.
వాస్తవానికి 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌తోనే కైరా అద్వానీకి అంత క్రేజ్ పెరిగింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఆ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్‌పై పడిందనుకోవాలి. సమంత వంటి స్టార్ హీరోయిన్లే వెబ్ సిరీస్‌పై దృష్టి పెడుతున్నారు. సో రష్మీ గౌతమ్ కూడా తన క్రేజ్‌ని అలా పెంచుకోవాలనుకుంటోంది కాబోలు.