'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయమైన ముద్దుగుమ్మ శ్రియ శరన్ దాదాపు స్టార్ హీరోలందరి సరసనా నటించింది. ఆ తర్వాతి జనరేషన్‌లో యంగ్ హీరోస్‌తోనూ జత కట్టింది. సైమల్‌టేనియస్‌గా, యంగ్ హీరోస్‌నీ, స్టార్ హీరోస్‌నీ కూడా ఓ చుట్టు చుట్టేసింది. దశాబ్ధంన్నరకు పైగానే ఇండస్ట్రీని ఏలుతున్న శ్రియ ఈ మధ్య కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇంత లాంగ్ కెరీర్ ఉన్నప్పటికీ, గ్లామర్‌కి మాత్రం ఎలాంటి మచ్చ అంటకుండా, ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తోంది. ఇప్పటికీ కుర్రకారును హీటెక్కించే హొయలు శ్రియ శరణ్ సొంతం.
ఇటీవల రష్యన్ మ్యుజిషియన్ ఆండ్రూని వివాహమాడి, కొన్నాళ్లు పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. మరీ ఇదివరకటిలా కాకున్నా, ఒకటీ అరా అవకాశాలు శ్రియ చెంతకు వస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో. అగ్రహీరోలు యాక్టివ్‌గా ఉన్న తరుణంలో శ్రియ లాంటి వాళ్లకు మళ్లీ క్రేజ్ రావడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ఆ క్రమంలోనే వెంకటేష్ నటిస్తున్న 'అసురన్' రీమేక్‌లో హీరోయిన్‌గా శ్రియ పేరు పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో శ్రియ వంపు సొంపులు, తళుకు, బెళుకులు బాగానే మెరిపిస్తున్నాయి. ఎక్కడెక్కడో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన హాట్ ఫోటో షూట్స్‌ని నెట్టింట్లో అప్‌లోడ్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది శ్రియ. అలా తాజాగా తిరువనంతపురంలోని ఓ హోటల్‌లో శ్రియ హాట్ హాట్ స్విమ్మింగ్ పూల్ స్నానాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. బికినీలో క్లీవేజ్ సొగసుల్ని ఆవగా ఆరేస్తూ, శ్రియ దిగిన ఫోటోలు చూసి, కొందరు లేటు వయసులో ఈ సొగసుల ఆరబోత ఏందమ్మా.! అని విమర్శిస్తుంటే, లేటు వయసులోనూ హాట్‌నెస్ ఇంచుకైనా తగ్గలేదే.. అని ప్రశంసలు కూడా వస్తున్నాయి.