నేనేమైనా టాక్సులు ఎగ్గొట్టానా: నెటిజ‌న్‌పై ర‌ష్మి ఫైర్‌

మరిన్ని వార్తలు

ఈనాటి అమ్మాయిలు మాట ప‌డ‌డానికి ఏమాత్రం స‌ముఖంగా లేరు. ఎప్పుడైనా, ఎక్క‌డైనా, ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా డేరింగ్ డాషింగ్ అంటూ దూసుకుపోతున్నారు. చేతిలో సోష‌ల్ మీడియా ఉంది క‌దా, అని ఏది ప‌డితే అది మాట్లాడితే... సెల‌బ్రెటీలు చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయ‌డం లేదు. వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. టిట్ ఫ‌ర్ టాక్ అంటూ గ‌ట్టిగా స‌మాధానం చెబుతున్నారు. ఇప్పుడు ర‌ష్మి అదే చేసింది. ఓ నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు ర‌ష్మి ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.


రామ‌మందిరం ప్రారంభోత్స‌వ సమ‌యంలో త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ర‌ష్మి ఓ ట్వీట్ చేసింది. దానికి పెడ‌ర్థాలు తీస్తూ ఓ నెటిజ‌న్ ''అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు చేస్తూ భ‌గ‌వంతుడి నామాన్ని జ‌పిస్తే అన్నీ తుడిచిపెట్టుకుపోతాయా'' అంటూ కామెంట్ పెట్టాడు. అది రష్మి దృష్టికి వెళ్లింది. ర‌ష్మి కూడా వెంట‌నే బ‌దులు ఇచ్చేసింది. ''అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు అంటే ఏమిటి?  నేనేమైనా టాక్సులు ఎగ్గొట్టానా?  తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వ‌దిలేశానా? చ‌ట్ట విరుద్ధ‌మైన ప‌నులు చేస్తున్నానా?  ఈమ‌ధ్య త‌ర‌చూ ఇలాంటి మాట‌లు విని విసిగిపోయా. నా దృష్టిలో భ‌గ‌వంతుడు స‌ర్వాంత‌ర్యామి. స‌నాత‌న ధ‌ర్మంలో నాకు న‌చ్చే విష‌యం అదే'' అంటూ బ‌దులు ఇచ్చింది. దాంతో స‌ద‌రు నెటిజ‌న్ కూడా కామ్ అయిపోయాడు. ర‌ష్మి ఇచ్చిన స‌మాధానం ఆమె అభిమానులకు బాగా న‌చ్చింది. స‌రైన స‌మాధానం ఇచ్చి, బుద్ది చెప్పావ్ అంటూ అమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS