'ఆర్.ఆర్.ఆర్' తరవాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. అయితే.. దేవరని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఏప్రిల్ 5న ఈ సినిమా రావడం కష్టమే అని ఫిల్మ్‌నగర్ టాక్,. దానికి కారణాలు ఎన్నో.
'దేవర'లో ప్రతి నాయకుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్ లో తన చేతికి గాయమైంది. ఆయన కోలుకొని మళ్లీ సెట్స్ లోకి అడుగు పెట్టడానికి చాలా కాలం పడుతుంది. సైఫ్ లేకపోతే.. షూటింగ్ జరిగేది ఎలా? 'దేవర' ఆలస్యానికి ఇదే ప్రధాన కారణం.
మరోవైపు ఏప్రిల్ నుంచి ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఎన్నికల సమయంలో సినిమాలపై ఎవరికీ పెద్దగా దృష్టి ఉండదు. అలాంటప్పుడు 'దేవర' లాంటి భారీ సినిమాలు విడుదల చేయడం రిస్కే.
అన్నింటికంటే ముఖ్యంగా అనిరుథ్ ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుథ్ చెప్పిన టైమ్‌కి అవుట్ పుట్ ఇవ్వడం కష్టమే. ఎందుకంటే తన చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ ఫినిష్ అయితే కానీ, 'దేవర'పై దృష్టి పెట్టలేడు. అందుకే 'దేవర' ఈ వేసవి బరి నుంచి తప్పుకోవడం ఖాయమన్న కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి.