సెలబ్రెటీలపై బోలెడన్ని గాసిప్పులు. సినిమా వాళ్లయితే.. గాసిప్ పుట్టని వాళ్లు ఉండరు. రోజూ ఏదో ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంటుంది. అయితే... కొన్ని సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొన్ని... మనసుని తీవ్రంగా బాధ పెడుతుంటాయి. జబర్‌దస్త్ ఫేమ్ రష్మిపై కూడా చాలా గాసిప్పులు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం రష్మిని చాలా బాధ పెట్టిందట. మనో వేదనకు గురి చేసిందట. ఈ విషయాన్ని ఇటీవల రష్మినే చెప్పింది.
''నేనో సెక్స్ స్కాండిల్ లో పట్టుపడ్డానని ఓ యూ ట్యూబ్ ఛానల్ ఓ న్యూస్ వైరల్ చేసింది. అది విన్నప్పుడు చాలా బాధేసింది. ఇలాంటి దరిద్రమైన వార్తల్ని ఎలా వైరల్ చేస్తారో నాకు అర్థంకాదు. ఓ వార్త రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోవాలి కదా? ఎలా పడితే అలా రాసేస్తారా'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను నటనపై ధ్యాస పెట్టే దిశగా అడుగులు వేస్తున్నానని చెప్పింది. నటన, పాత్రల ఎంపిక లాంటి విషయల్లో రాధికా ఆప్టే ని ఆదర్శంగా తీసుకొంటానని రష్మి అంటోంది.
''రాధికే ఆప్టే పాత్రల ఎంపిక చాలా బాగుంటుంది. బోల్డ్ క్యారెక్టర్స్ ని ధైర్యంగా చేస్తుంది. మీడియాతో కూడా చాలా స్పష్టంగా, స్టైయిట్ గా మాట్లాడుతుంది. తనలోని ధైర్యం, తెగువ నాకు నచ్చుతాయి'' అని సాటి నటికి కాంప్లిమెంట్లు ఇచ్చింది రష్మి.