అందాల రేష్మీ 'అంతకుమించి'

By iQlikMovies - July 09, 2018 - 10:35 AM IST

మరిన్ని వార్తలు

బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌ రేష్మీ మళ్లీ పెద్ద తెరపై సందడి చేయబోతోంది. వరుస చిత్రాలతో ఆ మధ్య సందడి చేసిన రేష్మీ ఈ మధ్య పెద్ద తెరపై ఎక్కడా కనిపించడం లేదు. అందుకే 'అంతకు మించి' అనే సినిమాతో అంతకుమించిన గ్లామర్‌తోనే వచ్చేస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఈ సినిమా కూడా థ్రిల్లర్‌ మూవీనే. గతంలోనే రేష్మీకి థ్రిల్లర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అనే స్టాంప్‌ పడిపోయింది. అయినా కానీ మళ్లీ అదే జోనర్‌ సినిమాతో వస్తోంది. 

అయితే ఈ సినిమా ఇంతకు ముందు తాను నటించిన థ్రిల్లర్‌ మూవీస్‌కి భిన్నంగా ఈ మూవీ ఉంటుందంటోంది రేష్మీ. జై ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జానీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పక్క బుల్లితెరపై యాంకరింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది రేష్మీ. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇలా థ్రిల్లర్‌ మూవీస్‌కి ఎక్కువగా సైన్‌ చేస్తోంది. ఇంతవరకూ రేష్మీ నటించిన చిత్రాల్లో 'గుంటూర్‌ టాకీస్‌' తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలు లేకపోయినప్పటికీ, గ్లామర్‌ విషయంలో మాత్రం ఏ సినిమాకి ఆ సినిమానే టాప్‌ లెవల్‌ అని చెప్పొచ్చు. 

అలాగే తాజా చిత్రంలో కూడా ఫుల్‌ డోస్‌ గ్లామర్‌ అప్పీల్‌ ఇవ్వనుందని ప్రోమోస్‌ ద్వారా సంకేతాలు పంపించేస్తోంది అందాల రేష్మీ. చూడాలిక 'అంతకుమించి'న గ్లామర్‌తో రేష్మీ ఈ సారైనా మంచి పేరు తెచ్చుకుంటుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS