తెలుగు తెరపై దూసుకుపోతున్న యువ కథానాయిక రష్మిక. తను చేసింది నాలుగైదు సినిమాలే. కానీ మహా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే కోటి కథానాయికగా ఎదుగుతోంది. అయితే.. తన చేతిలో కొన్ని వందల కోట్లు ఉన్నాయంటే నమ్ముతారా.?? అవును.. రష్మిక చేతిలో ఉన్న వందల కోట్లే టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లలో హాట్ టాపిక్‌గా మారింది. ఈమధ్య రష్మిక నివాసం, ఆఫీసులలో ఐటీ శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో విలువైన డాక్యుమెంట్లు లభించాయని తెలుస్తోంది. అవన్నీ రష్మిక తాలుకూ ఆస్తులని సమాచారం. వీటి విలువ రూ.250కోట్లని అంటున్నారు.
అయితే.. రష్మిక తండ్రి పెద్ద బిజినెస్ మేన్. తనకు బెంగళూరులో చాలా ఎస్టేటులున్నాయి. వాటిలో రష్మికకూ వాటా ఉంది. ఇదంతా సినిమాల్లో సంపాదించిన డబ్బు కానే కాదు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు. అవే ఇప్పుడు ఐటీ అధికారులకు చిక్కాయి. వీటిపై సక్రమంగా పన్నులు చెల్లిస్తే సరే సరి. లేదంటే రష్మిక జవాబు చెప్పుకోవాల్సివుంటుంది.