లైవ్‌ డాన్సులు అదరగొట్టేసిన రష్మికా.!

By iQlikMovies - July 20, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పేరుతో 'డియర్‌ కామ్రేడ్‌' ప్రమోషన్స్‌ని నాలుగు భాషల్లో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా విజయ్‌ దేవరకొండ, రష్మికా ఈ ఈవెంట్స్‌లో పాల్గొని ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా హైద్రాబాద్‌లో జరిగిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో రష్మికా డాన్సులు ఇరగదీసేసింది. ఇంతవరకూ రష్మికాలోని డాన్స్‌ టాలెంట్‌ని ఈ స్థాయిలో చూడలేదు. అలాంటిది లైవ్‌ షోలో ఈ రేంజ్‌లో రష్మికా రెచ్చిపోయి డాన్సులేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతవరకూ ఉన్న క్రేజ్‌తో పాటు,

 

ఈ పర్‌ఫామెన్స్‌ చూశాక, రష్మికా అంటే అంతులేని అభిమానం పెరిగిపోయింది ఫ్యాన్స్‌కి. నిజంగానే అంత కష్టపడింది రష్మికా. రష్మికా కమిట్‌మెంట్‌కి హ్యాట్సాఫ్‌ అనాల్సిందే అంటున్నారంతా. ఓ సాధారణ సెలబ్రిటీ డాన్సర్‌లా స్టేజ్‌పై రష్మికా వేసిన డాన్సులు చూపు తిప్పుకోనీయకుండా చేశాయి. ఏదో సరదాగా డాన్స్‌ హమ్‌ చేసినట్లుగా కాకుండా, ప్రొఫిషనల్‌ డాన్సర్‌లా పర్‌ఫామ్‌ చేసింది.

 

'డియర్‌ కామ్రేడ్‌' ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ సినిమాకి చేయనంత ఇన్నోవేటివ్‌గా ఈ సినిమా ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. అస్సలు గ్యాప్‌ లేకుండా, రెస్ట్‌ తీసుకోకుండా కంటిన్యూస్‌గా ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కోసం తామెంతో కష్టపడుతున్నామని విజయ్‌ దేవరకొండ తెలిపారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌, బిగ్‌బెన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS