మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న 'ఆచార్య' సినిమా షూటింగ్‌కి సంబంధించి ఆసక్తికరమైన గాసిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ గాసిప్ సారాంశమేంటంటే, 'ఆచార్య' సినిమాలో కాజల్ పాత్ర నిడివి చాలా తక్కువ అట. పేరుకి హీరోయిన్ అనేగానీ, సినిమాలో ఆమె కన్పించేది చాలా తక్కువ సన్నివేశాల్లోనేనట. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే, సినిమా మొత్తం ఆయనే కన్పించాలి.. కన్పిస్తారు కూడా.
మరోపక్క, ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా నటిస్తున్నాడు. అంటే, హీరోయిన్ స్పేస్ ఇంకా తక్కువైపోతుందన్నమాట. ఎటూ చరణ్‌కి కూడా ఓ హీరోయిన్ వుంటుంది మరి. ఎలా చూసుకున్నా, కాజల్‌కి తక్కువ స్క్రీన్ స్పేస్ లభించే అవకాశం వుంది. కరోనా నేపథ్యంలో చిన్న చిన్న మార్పులు కూడా చోటు చేసుకున్నాకట హీరోయిన్ విషయమై స్క్రిప్ట్‌లో.
దాంతో, కాజల్ నిడివి మరింత తగ్గిందని అంటున్నారు. జనవరిలో కాజల్ - చిరంజీవి మధ్య కీలక సన్నివేవాల్ని చిత్రీకరిస్తారనీ, చాలా వేగంగానే ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిపోతుందనీ, పాటల కోసం మాత్రం విదేశాలకు వెళ్ళాలా.? సెట్ వేసి చేసెయ్యాలా.? అన్న విషయమై కొంత సందిగ్ధం ఏర్పడిందనీ అంటున్నారు. అయితే, 'ఆచార్య' టీమ్ వర్గాలు మాత్రం, హీరోయిన్‌కి సినిమాలో అవసరమైనంత స్కోప్ వుంటుందని చెబుతుండడం గమనార్హం.