సమంత ఛాలెంజ్ ను స్వీకరించిన రష్మిక!

మరిన్ని వార్తలు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు; ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం జరిగింది.

 

ఈ చాలెంజ్ లోకి నన్ను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్న; కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS