RRR లో ఆయన పాత్ర అదేనట

మరిన్ని వార్తలు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భారీ చిత్రాలలో ఒకటి. గత నాలుగు నెలలుగా షూటింగులు ఆగిపోవడంతో 'RRR' షూట్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ మాత్రం వస్తూనే ఉంది. ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రకని ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రకని పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

 

ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న చరణ్, ఎన్టీఆర్ లకు సహాయం చేసే వ్యక్తిగా సముద్రకని కనిపిస్తాడట. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ చేస్తున్న పోరాటంలో సముద్రకని తోడుగా ఉంటూ శత్రువులపై పోరాడతాడట. సముద్రకని ఈమధ్య ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' సినిమాలో అప్పలనాయుడు పాత్రలో విలనీ పండించారు. 'RRR' లో పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారని అనుకోవాలి.

 

పరిస్థితులు అనుకూలిస్తే 'RRR' సినిమా షూటింగును మరో రెండు నెలల తర్వాత మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అప్పటి వరకూ రాజమౌళి తన నెక్స్ట్ సినిమా స్క్రిప్టును రెడీ చెయ్యడంలో బిజీగా ఉంటారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS