‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన రష్మిక మండన్న, ‘పుష్ప’ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. ఈ సినిమా గురించి చాలా గాసిప్స్ ప్రచారంలో వున్నాయి. అసలు సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత పెద్దగా వుండబోదనీ, పైగా గ్లామర్ చూపించే అవకాశం అస్సలేమారతం ఆ పాత్రకు వుండదనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. అయినాగానీ, రష్మిక మాత్రం ‘పుష్ప’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది.
‘పుష్ప’ స్టోరీ లైన్ తనకు బాగా నచ్చిందనీ, ఇంతకుముందెన్నడూ ఇలాంటి కథని మనం చూడలేదనీ చెబుతున్న రష్మిక, సినిమాలో తన పాత్రేంటో మాత్రం చెప్పడంలేదు. అయినా, చెప్పేస్తుందా.? ఏంటీ.? ఎవరెన్ని గాసిప్స్ ప్రచారంలోకి తెచ్చినా, ‘పుష్ప’ సినిమా విషయమై తనకు ఖచ్చితమైన అభిప్రాయాలు, అంచనాలు వున్నాయని అంటోంది రష్మిక మండన్న. ‘నో డౌట్.. ఇది చాలా స్పెషల్ మూవీ. నాకు నటిగా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. గ్లామర్ తదితర విషయాలన్నీ ముందు ముందు తెలుస్తాయ్..’ అని రష్మిక అభిప్రాయపడింది. కాగా, అల్లు అర్జున్ తరహాలోనే రష్మిక పాత్ర కూడా గ్లామర్ అస్సలేమాత్రం లేకుండా వుంటుందనే గాసిప్ ప్రచారంలోకి వచ్చిన విషయం విదితమే.