సవాళ్లు స్వీకరించడానికి మన హీరోయిన్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సాధారణంగా వాళ్లకు రొటీన్ పాత్రలే ఎక్కువగా దొరుకుతుంటాయి. తమలోని అసలు సిసలు నటిని బయటపెట్టే అవకాశం తక్కువగా వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలా? రష్మిక ఈ విషయంలో కాస్త ముందే ఉంటుంది. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. మిగిలినవాటిలో తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉండేలా చూసుకుంది రష్మిక. అందుకే అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఇప్పుడు అల్లు అర్జున్ తో `పుష్ష` సినిమాలో నటిస్తోంది. సుకుమార్ సినిమాలో కథానాయికల పాత్రలు కాస్త వైవిధ్యంగా ఉంటాయి. ఈసారీ అంతే. రష్మిక పాత్ర మహా మాసీగా ఉంటుందట. ఈ సినిమా కోసం రష్మిక చిత్తూరు యాస నేర్చుకుంటోంది. బన్నీ, రష్మికతో పాటు ప్రధాన తారాగణం చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. అందుకోసమే ప్రత్యేకంగా డైలాగులు బట్టీ పడుతోందట రష్మిక. లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు కదా. ఈ గ్యాప్‌లో డైలాగులన్నీ నేర్చేసుకుందట. ఈ సినిమాలోనూ కొత్త రష్మికని చూడొచ్చన్నమాట.