గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ 'గీత' దాటిన కన్నడ కుట్టీ.!

By iQlikMovies - February 13, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. అప్పటికే కన్నడ 'కిర్రాక్ పార్టీ' సినిమాతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ తర్వాత తెలుగులో 'గీత గోవిందం' సినిమాతో సంచలనమైంది. అయితే గ్లామర్‌కి తాను దూరమనీ, ఎక్స్‌పోజింగ్‌కి పెద్దగా ఇష్టపడననీ చెప్పిన మన గీత కాస్తలో గీత దాటిందనిపిస్తోంది. తాజాగా రష్మికా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

 

గ్లామర్‌ లేకున్నా రష్మికాకి ఉన్న క్రేజ్‌ చాలా ఎక్కువ. ఇక ఈ పాటి గ్లామర్‌తో దర్శనమిచ్చిందా.? ఇక అంతే మరి. ఈ బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో రష్మికా ఫోటోకి లైకులు పోటెత్తేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీకి చాలా ఆఫర్లు లైన్‌లో ఉన్నాయి. రష్మికా బెస్ట్‌ ఆన్‌ స్క్రీన్‌ పాట్నర్‌ విజయ్‌ దేవరకొండతో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో త్వరలోనే రష్మికా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు యంగ్‌ హీరో నితిన్‌తో రష్మికా 'భీష్మ' సినిమలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS