ఇన్నాళ్ల కెరీర్‌లో ఎప్పుడూ రకుల్ ఫిట్‌నెస్‌లో అదుపు తప్పింది లేదు. 'రారండోయ్ వేడుక చూద్దాం..' సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినా, అది పెద్దగా పట్టించుకోవల్సింది కాదు. ఫిట్‌గా ఉంటేనే హెల్దీగా ఉంటామని చెబుతోంది రకుల్. అందుకే మొదట్నుంచీ ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది రకుల్. తన జీవనశైలిలో వ్యాయామాన్ని న్యితకృత్యం చేసుకుంది. హైద్రాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో ఫిట్‌నెస్ సెంటర్స్‌ని ప్రారంభించి, తద్వారా అవగాహన కల్పిస్తోంది.
ఇక రకుల్ ప్రీత్ ఎప్పుడూ ఇంత ఫిట్‌గా ఎందుకుంటుంది.. అంటే మొదటి కారణం నిర్మాతల కోసమే అంటోంది. తనను నమ్మి సినిమా ఒప్పుకున్నాక, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేయాలి. సినిమాలో కొన్ని సీన్లలో లావుగా కనిపించి, కొన్ని సీన్లలో స్లిమ్‌గా కనిపించడం తనకస్సలు ఇష్టం లేదంటోంది రకుల్. ఒక సినిమా ఒప్పుకున్నాక, ఆ సినిమా మొదట్నుంచి, చివరి వరకూ గ్లామర్‌లో ఒకే రకమైన ఫిట్‌నెస్ లెవల్స్ ప్రదర్శించాలి. అంలా ఉండాలంటే వర్కవుట్స్ తప్పనిసరి.
రెమ్యునరేషనే కాదు, మన నుండి వచ్చే ఔట్‌పుట్ కూడా అంతే పర్‌ఫెక్ట్‌గా ఉండాలంటోంది. ఈ విషయంలో రకుల్ డెడికేషన్‌ని మెచ్చుకుని తీరాలి. అంతేకాదు ఫిట్‌గా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని రకుల్ చెబుతోంది. ఈ లవర్స్‌డేకి రకుల్ 'దేవ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తి హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. దీంతో పాటు ఇదే రోజు సూర్యతో రకుల్ నటిస్తున్న 'ఎన్‌జీకే' టీజర్ కూడా రానుంది.