రష్మిక దెబ్బకి పూజని పక్కన పెట్టేసిన త్రివిక్రమ్‌.?

మరిన్ని వార్తలు

‘అల వైకుంఠపురములో..’ సినిమాతో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్టర్‌గా సూపర్బ్‌ హిట్‌ కొట్టేశాడు. ఇక ప్రస్తుతం తదుపరి సినిమా కోసం స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నాడు. అయితే, త్రివిక్రమ్‌ తదుపరి సినిమా ఏ హీరోతో.. అంటే, ఎన్టీఆర్‌ పేరు ప్రచారంలో ఉంది. కానీ, ఇప్పుడప్పుడే ఎన్టీఆర్‌ ఖాళీ అయ్యే ఛాన్సెస్‌ కనిపించడం లేదు. అలా అని ఇప్పటికిప్పుడు త్రివిక్రమ్‌ ఏ హీరోతో సినిమా చేయాలన్నా కుదిరే పని కాదు. సో త్రివిక్రమ్‌ వెయిట్‌ చేయాల్సిందే తప్పదు. ఇదిలా ఉంటే, హీరో ఎవరైనా తన సినిమాలో హీరోయిన్‌ మాత్రం రష్మికనే అని త్రివిక్రమ్‌ మెంటల్‌గా ఫిక్స్‌ అయిపోయాడట. అందుకు కారణం రష్మిక మాటల గారడీనే. ఆమె మాటల టాలెంట్‌కి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఫ్లాట్‌ అయిపోయాడట.

 

‘భీష్మ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మిక ప్రసంగానికి ఇంప్రెస్‌ అయిపోయిన త్రివిక్రమ్‌ తన సినిమాలో హీరోయిన్‌గా రష్మిక పాత్రను చాలా స్ట్రాంగ్‌గా డిజైన్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడట. ఇప్పటికే హీరో క్యారెక్టర్స్‌ని డామినేట్‌ చేసేస్తున్న రష్మికను, ఇక షార్ప్‌ అండ్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ చేతిలో పడితే, పూర్తిగా సాన పెట్టేయడూ. ఇంతవరకూ బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాల్లో పూజా హెగ్దేకి ఛాన్సిచ్చిన త్రివిక్రమ్‌ ఇకపై ఆ ఛాన్స్‌ రష్మికకు ఇవ్వనున్నాడనీ దీన్ని బట్టి అర్ధమవుతోంది. ఏది ఏమైతేనేం, ఏదో అనుకున్నాం. కానీ, రష్మిక ఇంప్రెషన్‌ మామూలుగా లేదు. ఇటు ఫ్యాన్స్‌నీ, అటు ఫిలిం మేకర్స్‌నీ ఎట్‌ ఏ టైమ్‌ గారడి చేసేస్తోంది. హీరోయిన్‌ ఇంత యాక్టివ్‌గా కనిపిస్తే, ఎవరికైనా అలాగే ఉంటుంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS