రష్మికను ఆకాశానికెత్తేసిన బన్నీ.!

మరిన్ని వార్తలు

త్వరలోనే బన్నీ `రష్మిక ' ఆన్‌ స్క్రీన్‌పై రొమాన్స్‌కి సిద్ధమవుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఈ జంట కనువిందు చేయనుంది. ఇటీవలే ‘భీష్మ’ చిత్రంతో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రష్మికకు ఈ సందర్భంగా బన్నీ కంగ్రాట్స్ చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ చేశారు. రష్మికను ‘ఆల్‌రౌండర్‌’గా అభివర్ణించాడు. ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌తో మాస్‌ స్టెప్పులు ఇరగదీసేసిన రష్మిక, తర్వాత ‘భీష్మ’లోనూ కష్టపడి క్రిటికల్‌ స్టెప్పులేసి డాన్స్‌ ప్రియుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు అసలు సిసలు అగ్ని పరీక్ష రష్మికకు.

అల్లు అర్జున్‌తో డాన్స్‌ చేయడమంటే అంత ఆషామాషీ కాదు. కానీ, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలు రష్మికకు డాన్స్‌ రిహార్సల్స్‌లా పని చేశాయనడం అతిశయోక్తి కాదేమో. ఆయా సినిమాల్లో స్టెప్పులిరగదీసిన రష్మిక, ఇప్పుడు బన్నీ పక్కన డాన్స్‌ చేయడం కోసం వెరీ ఈగర్‌గా ఎదురు చూస్తోందట. అంతేకాదు, డాన్సుల్లో బన్నీని మ్యాచ్‌ చేయడం కోసం షూటింగ్‌ నుండి కాస్త టైమ్‌ దొరికినా, బీభత్సంగా డాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేస్తోందట కూడా. మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. కేరళ అడవుల్లో షూటింగ్‌ కోసం గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేస్తున్నాడు డైరెక్టర్‌ సుకుమార్‌. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి పలు టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. కానీ, ఇంతవరకూ టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS