ప్ర‌భాస్‌తో ర‌ష్మిక‌?

మరిన్ని వార్తలు

ర‌ష్మిక ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉంది. పుష్ప 2 సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌వ్వ‌డం, అందులోని శ్రీ‌వ‌ల్లీ పాత్ర‌కు ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో... ర‌ష్మిక డిమాండ్ మ‌రింత పెరిగిపోయింది. ర‌ష్మిక ఇప్పుడు బాలీవుడ్ ఆఫ‌ర్ల‌తో బిజీ గా ఉంది. త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ తో ఓ సినిమా చేస్తోంది. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ స‌ర‌స‌న కూడా న‌టించ‌బోతోంద‌ని టాక్‌.

 

ప్ర‌భాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో `స్పిరిట్‌` సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ర‌ష్మిక‌ని ఎంచుకునే ఛాన్స్ ఉంద‌ట‌. సందీప్ రెడ్డి వంగా ప్ర‌స్తుతం `యానిమ‌ల్‌` అనే సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో ర‌ష్మిక ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఆ పాట‌లో ర‌ష్మిక డాన్స్‌, త‌న స్పిరిట్ చూసి... వెంట‌నే ప్ర‌భాస్ సినిమాలో ర‌ష్మిక‌ని తీసుకున్నాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం `ప్రాజెక్ట్ కె`పై దృష్టి పెట్టాడు ప్ర‌భాస్‌. మ‌రోవైపు `ఆది పురుష్‌` షూటింగ్ జ‌రుగుతోంది. ఈ యేడాది చివ‌ర్లో `స్పిరిట్` సెట్స్‌పైకి వెళ్లొచ్చు. అయితే ఇందులో మ‌రో క‌థానాయిక‌కీ అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందుతోంది. ఆ పాత్ర‌లో ఓ బాలీవుడ్ భామ‌ని ఎంచుకునే అవ‌కాశం ఉంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS