కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా పర్ఫామెన్స్కి ఎక్కువ గ్లామర్‌కి తక్కువ అన్న సంగతి తెలిసిందే. గ్లామర్‌తో కాకుండా, తన పర్ఫామెన్స్తోనే యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుందీ బ్యూటీ. కేవలం స్కిన్ షో చేస్తేనే యూత్ పడిపోతారు అనే సాంప్రదాయానికి నీళ్లొదిలేసేలా చేసింది ఈ అమ్మడు. ఫ్యాషన్‌లో జస్ట్ ఏవరేజ్ మార్కులు కూడా వేయించుకోలేద రష్మికా మండన్నా. కానీ, క్రేజ్‌లో నూటికి నూరు మార్కులు కొట్టేస్తుంది. గ్లామర్ లేకున్నా, సోసల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది రష్మికా మండన్నాకి. అప్పుడప్పుడూ తన ఫాలోవర్స్ కోసం కొద్ది కొద్దిగా గ్లామర్ ప్రయోగాలు చేస్తుంటుంది.
అది ఆమెకు సూటవుతుందా? లేదా? అనే విషయం పక్కన పెడితే, లైకుల మీద లైకులు కొట్టి ఎంకరేజ్ చేసే ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. తాజాగా ఈ బ్యూటీ కొన్ని స్టైలిష్ ఫోటోలు పోస్ట్ చేసింది. బ్లాక్ కాంబినేషన్లో ఓ మోడ్రన్ షార్ట్ డ్రస్ ధరించి, సోఫాలో అలా స్టైల్‌గా కూర్చుంది. కాళ్లకి ఆరెంజ్ కలర్ సాక్సులు ధరించి, బ్లాక్ కలర్ హై హీల్స్ వేసింది. లూజ్‌గా వదిలేసిన హెయిర్‌లో అలా వేళ్లు పెట్టి నిమురుతూ, ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇది చాలదు ఫ్యాన్స్‌కి. ప్రస్తుతం రష్మికా చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. తెలుగులో మహేష్‌బాబు, అల్లు అర్జున్, నితిన్ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది.