లక్కీ బ్యూటీ సూపర్బ్‌ ట్రెడిషనల్‌ లుక్‌

By iQlikMovies - August 24, 2018 - 18:49 PM IST

మరిన్ని వార్తలు

హీరోయిన్స్‌లో మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ అయిపోయిందిప్పుడు రష్మికా మండన్నా. ఎవరి నోట విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే ఇప్పుడు. అంత పాపులర్‌ ఫిగర్‌ అయిపోయింది రష్మికా. చేసినవి రెండు సినిమాలే. రెండూ సూపర్‌హిట్సే. రెండో సినిమా అయిన 'గీత గోవిందం'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసింది. హిట్‌ ఒక వంతు. టాక్‌ మరో వంతు ఈ సినిమాకి. అందుకే కొత్త షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌ కోసం పలు సంస్థలు ఈ ముద్దుగుమ్మ వెంట క్యూ కట్టేస్తున్నారట. 

అందులో భాగంగానే హైద్రాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా హైద్రాబాద్‌లో ముగ్ధ అనే కంచిపట్టు చీరల షాప్‌ ఓపెనింగ్‌కి ఈ ముద్దుగుమ్మ హాజరైంది. కంచిపట్టు చీరలో మెడలో బంగారు ఆభరణాలతో, నడుముకు ఒడ్డాణంతో పక్కా ట్రెడిషనల్‌ లుక్‌లో అచ్చం లక్ష్మీదేవిలా మెరిసిపోయింది. ఈ లుక్‌లో రష్మికాని చూసిన అభిమానులు సంబర పడిపోతున్నారు. 

అసలే లక్కీగాళ్‌. ఈ లక్కీగాళ్‌ చేతుల మీదుగా ఓపెన్‌ అయిన ఈ షాపింగ్‌ మాల్‌ ఇంకే రేంజ్‌లో కళకళలాడిపోతుందో చూడాలి మరి. ఇక అమ్మడు నటించిన 'గీత గోవిందం' చిత్రం 70 కోట్లు వసూళ్లు దిశగా పరుగులు పెడుతోంది. వసూళ్లు, ప్రశంసల నడుమ 'గీత గోవిందం' బాక్సాఫీస్‌ దుమ్ము దులిపేస్తోంది. ఇక ఈ సినిమా సంగతిటుంచితే, అమ్మడి క్రేజ్‌కి రాబోయే 'దేవదాస్‌' సినిమా పైనా అంచనాలు పెరిగిపోతున్నాయ్‌. పక్కాగా 'దేవదాస్‌'తో రష్మికాకి హ్యాట్రిక్‌ కన్‌ఫామ్‌ అని ఆల్రెడీ ఫ్యాన్స్‌ ఓ అంచనాకి వచ్చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS