ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. ఈ పేరు టాలీవుడ్లో గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. అయితే ఇకపై ఈ పేరుకు మరింత పాపులారిటీ వచ్చిందనడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చిన సినిమా 'ఛలో' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది.
అయితే ఈ ముద్దుగుమ్మ విషయంలో ఓ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోందిప్పుడు. అమ్మడు తన రెమ్యునరేషన్ బాగా పెంచేసిందట. 'ఛలో' రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే ఈ మలయాళీ భామ రెమ్యునరేషన్ పెంచేసిందనీ టాక్ వినిపించింది. అంటే సినిమా సక్సెస్‌పై విడుదలకు ముందే కాన్ఫిడెన్స్ బాగా వచ్చేయడంతోనే రష్మికా రెమ్యునరేషన్ అంతలా పెంచేసిందని అంటున్నారు. అయితే ఇప్పుడు సినిమా విడుదలైంది. సక్సెస్ కొట్టేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మని పట్టుకోవడం అంత సులభం కాదంటున్నారు.
మామూలుగానే సక్సెస్ అనేది హీరోకైనా, హీరోయిన్‌కైనా రెమ్యునరేషన్లో ఖచ్చితంగా డిఫరెన్స్ తెస్తుంది. ఈ విషయంలో ఈ మలయాళీ భామ మరికొంచెం స్ట్రిట్గానే వ్యవహరిస్తుందట. గతంలో కన్నడ 'కిరిక్ పార్టీ' విజయం తర్వాతనే ఈ ముద్దుగుమ్మకి తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయట. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే ఆ ఆఫర్స్‌ని ఈ భామ వదులుకుందనీ ఓ గాసిప్ ఉంది. 'జై లవకుశ' టైంలోనే ఎన్టీఆర్‌తో నటించాల్సి ఉందీ భామ. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే ఆ ఛాన్స్ తృటిలో మిస్ చేసుకుందట.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది రష్మికా. ఇది కాక టాలీవుడ్లో స్టార్డమ్ ఉన్న మరో యంగ్ హీరో సినిమాకీ ఈ ముద్దుగుమ్మ కమిట్ అయ్యిందని సమాచారమ్. ఈ జోరు చూస్తుంటే, గతంలో టాలీవుడ్‌కి రకుల్ ప్రీత్ సింగ్ దూసుకొచ్చినట్లుగా స్టార్డమ్ పరంగానూ, రెమ్యునరేషన్ పరంగానూ ఈ ముద్దుగుమ్మ దూకుడు ప్రదర్శించేలానే అనిపిస్తోంది. అయితే గాసిప్స్ విషయంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ స్పందించాల్సి అవసరం ఉంది.