రష్మికా కోలీవుడ్‌ ఎంట్రీ షురూ.!

By iQlikMovies - November 30, 2018 - 14:51 PM IST

మరిన్ని వార్తలు

కన్నడలో 'కిరిక్‌ పార్టీ' సినిమాలో నటించిన రష్మికా మండన్నా, అక్కడే కాకుండా, తెలుగులో కూడా పాపులర్‌ అయిపోయింది. ఎంట్రీకి ముందే ఏ హీరోయిన్‌కీ లేనంత ఫేమ్‌ ఈ హీరోయిన్‌కి వచ్చేసింది. అసలు రష్మిక అంటే ఎవరో తెలియకుండానే ఆమె గురించి గాసిప్స్‌ తెలుగు సినిమాలో తెగ హల్‌చల్‌ చేసేశాయి. అలాంటిది 'ఛలో' సినిమాతో తెలుగులో తొలి పాదం మోపిన ఈ ముద్దుగుమ్మ, డెబ్యూ మూవీకే సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసేసుకుంది.

తదుపరి సెన్సేషనల్‌ హీరో విజయ్‌దేవరకొండతో 'గీత గోవిందం' సినిమాలో నటించి సంచలనం సృష్టించింది. అతి తక్కువ టైంలో అత్యంత ఎక్కువ మంది ఫాలోవర్స్‌ని సంపాదించింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్‌ అంటే అది రష్మికానే అనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇదే క్రేజ్‌ ఇప్పుడు కోలీవుడ్‌లోనూ దక్కించుకుంటోందీ హాట్‌ హాట్‌ సెన్సేషనల్‌ బ్యూటీ.

ఇంకేముంది తమిళంలో స్టార్‌ హీరో విజయ్‌తో రష్మికా ఎంట్రీ షురూ కానుందని ఈ మధ్య సోషల్‌ మీడియా వేదికగా తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అదంతా ఉత్తదే అని ఆమె కొట్టిపారేసింది. అయితేనేం ఆ వార్తలో నిజం లేకపోయినా, నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. అలా విజయ్‌ సినిమా కోసం రష్మికాను అనుకున్న మాట వాస్తవమేనట. కానీ లాస్ట్‌ మినిట్‌లో ఆ ఛాన్స్‌ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందనీ కోలీవుడ్‌ టాక్‌.

ఎలాగైతేనేం రష్మికా త్వరలోనే ఓ తమిళ చిత్రంలో కనిపించబోతోందనీ తెలుస్తోంది. ఇంతకీ విజయ్‌ సరసన రష్మికా ఛాన్స్‌ తన్నుకెళ్లిందెవరో తెలుసా సౌత్‌ క్వీన్‌ నయనతార. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విజయ్‌ 63వ చిత్రమిది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS