తొలిసారి ఎన్టీఆర్ తో రష్మిక

మరిన్ని వార్తలు

నేషనల్ క్రష్ రష్మిక జోరు మాములుగా లేదు. వరసగా అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొంది, బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. యానిమల్ సినిమాతో నటన పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. దీనితో క్రేజీ ప్రాజెక్ట్స్ లో , స్టార్ డైరక్టర్స్, హీరోలు రష్మికకే ఓటువేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 లో అల్లు అర్జున్ తో నటిస్తోంది. ఇది కాక గర్ల్ ఫ్రెండ్ అనే లేడి ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఇంకా మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో కూడా రష్మిక పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని సమాచారం. 


ఎన్టీఆర్, ప్రస్తుతం దేవర కంప్లీట్ చేసి, బాలీవుడ్ లో వార్ 2 షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఇంకో వైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మొదలుకానుంది అని టాక్. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ తో చేయబోయే మూవీ ఈ ఏడాదిలోనే మొదలు కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సినిమా టైటిల్ కూడా 'డ్రాగన్‌' అని ఫిక్స్ చేసినట్టు సమాచారం. హీరోయిన్ ఎవరన్నది ఇప్పటివరకు ఖరారు కాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రష్మిక పేరు వినిపిస్తోంది. రష్మిక, ఎన్టీఆర్ మొదటిసారిగా జోడి కట్టనున్నారని, ఫాన్స్ సంబరపడుతున్నారు.           


యానిమల్ సినిమాతో రష్మిక క్రేజ్ పెరిగింది, ఎన్టీఆర్ డ్రాగన్ లో ఆమె అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్‌ భావిస్తున్నాడట. రష్మిక మహేష్ బాబు, బన్నీలతో జోడి కట్టింది. ఇప్పుడు     ఎన్టీఆర్ తో కలిసి నటించనుంది. వీరి కాంబో కోసం ఎదురుచూస్తున్న ఫాన్స్ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరబోతోంది. శ్రీవల్లీ, ఎన్టీఆర్‌ జోడీ సూపర్ గా ఉంటుందని, అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS