రష్మికా మండన్నాకి సక్సెస్‌తో పాటు, క్రేజ్ కూడా ఎక్కువే. నిజానికి అమ్మడి లిస్టులో ఉన్న సక్సెస్ అంటే రెండే రెండుగా భావించాలి. చేసినవి మూడు సినిమాలే అయినా రెండు హిట్లు కొట్టేసింది కదా. గ్రేటే మరి. ఇకపోతే, సోషల్ మీడియాలో రష్మికకు చాలా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది నెట్టింట్లో రష్మిక. అయితే, తాజాగా రష్మికకు నెట్టింట్లో చేదు అనుభవం ఎదురైంది. అందుకు కారణం ఆమె పోస్ట్ చేసిన చిన్నప్పటి పిక్సే. నిజంగానే చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉంది రష్మికా మండన్నా.
చాలా మంది నుండి ఇదే రెస్పాన్స్ వచ్చింది. కానీ, కొందరు ఆకతాయిలు నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. 'చిన్నప్పుడు ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయ్యాకా.. అంతర్జాతీయ స్థాయిలో డాష్ డాష్..' అంటూ జుగుప్సాకరమైన పోస్ట్‌లు పెట్టారు. ఈ కామెంట్స్‌కి స్పందించిన రష్మిక ఆ నెటిజన్స్‌కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. గతంలోనూ రష్మిక తనపై వచ్చిన పిచ్చ కామెంట్స్‌కి ఇలానే ఫైర్ అయ్యింది. అయితే, ఈ సారి ఇంకొంచెం గట్టిగా ఫైర్ అయ్యింది.
నిజానికి ఇలాంటి కామెంట్స్ పట్ల రెస్పాండ్ అయితే, వ్యవహారం నెక్స్‌ట్ లెవల్‌లో ఉంటుంది. అందుకే చాలా మంది అందాల భామలు ఇటువంటి నెగిటివ్ కామెంట్స్‌ని లైట్ తీసుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రెస్పాండ్ అవుతుంటారు. కానీ, ఇమీడియట్‌గా రెస్పాండ్ అయిన రష్మికకు ముందు ముదు ఎలాంటి వింత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో సోషల్ మీడియాలో చూడాలి మరి.