సీక్వెల్ అంటే... అందరికీ ఇంట్రస్ట్రే. ఓ సినిమా హిట్టయితే... వెంటనే సీక్వెల్ కి రంగం సిద్ధం చేసేస్తారు. ఆ సినిమాలో నటించినవాళ్లనే సీక్వెల్లోనూ కనిపించేలా జాగ్రత్త పడతారు. అయితే.. తన సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో తాను నటించనని తెగేసి చెబుతోంది రష్మిక. ఆ వివరాల్లోకి వెళ్తే...
రష్మికకు కన్నడలో మంచి పేరు తెచ్చిన సినిమా కిర్రాక్ పార్టీ. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారు. అయితే.. రష్మిక మాత్రం ఈ సీక్వెల్లో నటించడానికి ఒప్పుకోలేదని టాక్. దానికి కారణం రక్షిత్ శెట్టినే. కిర్రాక్ పార్టీ సమయంలోనే రక్షిత్కీ, రష్మికకీ మధ్య లవ్ ఎఫైర్ నడిచింది. ఆ తరవాత నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో.. సడన్ గా బ్రేకప్ అయిపోయింది. నిజానికి 2018లోనే ఈ సీక్వెల్ పట్టాలెక్కాలి. కానీ ఈ బ్రేకప్ వల్ల అది ఆగిపోయింది. ఇన్నాళ్లకు ఈ సినిమాని సీక్వెల్ తీస్తున్నారు. అందులో రష్మిక నటించనని చెప్పడంతో.. కొత్త అమ్మాయిని కథనాయికగా ఎంచుకున్నార్ట. రష్మిక ప్లేసులో వచ్చిన ఆ అమ్మాయి ఎవరో, తాను వెండి తెరపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.