'నటిగా కెరీర్ మొదలైన నాటి నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నా''అని తన మనసులో మాట చెప్పింది రష్మిక మందన. సోషల్‌మీడియా వేదికగా తన గురించి వస్తోన్న ట్రోల్స్ పై స్పందించింది. నా మేలు చేసే విమర్శలను స్వాగతిస్తాను కానీ ద్వేషం మంచిది కాదని ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది.
‘‘చాలా కాలంగా కొన్ని విషయాలు నన్ను భాధ పెడుతున్నాయి. వాటిని ఇప్పుడు మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చింది. నటిగా కెరీర్ మొదలైన నాటి నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నా. సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివిటీ నన్ను బాధపెట్టాయి. కానీ నేను ఎంచుకున్న జీవితం అలాంటిది. ఇక్కడ అందరికీ నేను నచ్చనని, ప్రతిఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. నేను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను ట్రోల్ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిని చూసి నా మనసు గాయపడింది. ట్రోల్స్ ని పట్టించుకోకూడదని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మితిమీరిన ద్వేషం మంచిది కాదు'' అని చెప్పుకొచ్చింది రష్మిక.