శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `పడి పడి లేచె మనసు`. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. అయితేనేం..? శర్వా- సాయి పల్లవిల కెమిస్ట్రీ మాత్రం బాగా పండింది. ఈ జంట చూడ్డానికి బాగుందనుకున్నారంతా. అందుకే... మరో సినిమాలోనూ ఈ కాంబినేషన్ ని రీపీట్ చేయాలనుకున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆడాళ్లూ మీకు జోహార్లూ`. ఇందులో సాయి పల్లవినే కథానాయిగా ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
ఆ స్థానంలో రష్మికని కథానాయికగా ఎంచుకున్నారు. తిరుపతిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ వివరాలు త్వరలో తెలుస్తాయి. నిజానికి వెంకటేష్ కోసం అనుకున్న కథ ఇది. వెంకీ ఓకే చెప్పాడు కూడా. కానీ ఎందుకనో పట్టాలెక్కలేదు. అదే కథ ఇప్పుడు శర్వాకి వర్కవుట్ అయ్యింది.