విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట గూర్చి చాలా రోజులుగా గుస గుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరి మధ్య ఎదో ఉందని ఎంత మంది గోల పెడుతున్నా, మీడియా మొత్తం కోడై కూస్తున్న వీరు మాత్రం ఏమీ పట్టనట్టు ఎవరి పని వారు చేసుకు పోతున్నారు, ఇలాంటి వార్తలపై ఎప్పుడూ, ఎక్కడా స్పదించలేదు. క్లారిటీ ఇవ్వలేదు. పెళ్లి వార్తలు రాసినప్పుడు కూడా తోసి పుచ్చలేదు. హాయ్ నాన్న ఆడియో రిలీజ్ లో విజయ్- రష్మిక హాలిడే ఫొటోస్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవటంతో అందరూ అవాక్కు అయ్యారు. అయినా వీరిద్దరూ బెదర లేదు, బయట పడలేదు.
రీసెంట్ గా కాస్తా టైం దొరకటంతో రష్మిక ఫాన్స్ తో చిట్ చాట్ పెట్టింది. ఆ చాటింగ్ సందర్భం గా ఒక అభిమాని రష్మిక భర్తకి ఉండవలసిన లక్షణాల గురించి ప్రస్తావిస్తూ “ఆమె నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. ఆమె భర్త ప్రత్యేకంగా ఉండాలి. ఆమె భర్త వీడిలా ఉండాలి. నా ఉద్దేశ్యం వెరీ డేరింగ్. ఆమెను ఎవరు రక్షించగలరు. మేము ఆమెను రాణి అని పిలుస్తాము, అప్పుడు ఆమె భర్త కూడా రాజులా ఉండాలి” అని ట్వీట్ చేసాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. ‘‘అది చాలా నిజం’’ అని సమాధానమిచ్చింది.
ట్వీట్‌లోని “VD” అనే పదం విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన్నది అందరికీ తెలిసిందే. అయినా ఆమె అవును అని చెప్పటంతో శ్రీవల్లి విజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందని అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ ఊహా గానాలకి విజయ్ రష్మిక ఎప్పుడూ తెరదించుతారో చూడాలి.