మూడేళ్ళ వరకు రష్మిక బిజీ

మరిన్ని వార్తలు

పాన్ ఇండియా హీరోయిన్స్ లలో రష్మిక ఒకరు. మొదట కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరవాత తెలుగులోకి వచ్చింది. 'చలో' మూవీతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ సరసన నటించింది. బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. తరవాత కోలీవుడ్,  బాలీవుడ్ లో నటించింది. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. దీనితో రష్మిక మోస్ట్ వాంటెడ్ పానిండియా హీరోయిన్ గా మారింది. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఎంతలా అంటే దాదాపు 2027 వరకు అమ్మడి డైరీ ఖాళీ లేదని టాక్. 


ఈ ఏడాది శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాతో దీపావళి బరిలో దిగుతోంది. ఇందులో ధనుష్, నాగార్జున లాంటి స్టార్స్ ఉన్నారు. నెక్స్ట్ డిసెంబర్ లో 'పుష్ప 2 ' తో బ్లాస్ట్ కి రెడీ గా ఉంది. ఈ రెండిటి తరవాత 'రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో  'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా చేస్తోంది. ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ.  ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో నటించిన రష్మిక మొదటిసారిగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తుండటం విశేషం. ఇది కూడా పానిండియా వైడ్ గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. 


బాలీవుడ్ లో మురుగు దాస్, సల్మాన్ కాంబో మూవీ 'సికిందర్' లో రష్మిక నటిస్తోంది. ఈ మూవీ 2025 లో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ హిట్ అయితే బాలీవుడ్ లో శ్రీవల్లి  హావా మొదలైనట్టే. ఇది కాకుండా  విక్కీ కౌశల్ తో 'చావా' లో కూడా నటిస్తోంది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ లో ఇప్పటికే రష్మికను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక మొదటి సినిమా ఇది. ప్రభాస్, సందీప్ వంగా సినిమా  'స్పిరిట్' లో కూడా నేషనల్ క్రష్ పేరు వినిపిస్తోంది. ఇవన్నీ పానిండియా క్రేజీ ప్రాజెక్ట్స్ కావటం ఇంకో విశేషం. ఈ క్రమంలోనే రష్మిక రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకి 13 కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS