'సరిలేరు నీకెవ్వరూ..' టీజర్‌లో హీరోయిన్ రష్మికకు చోటు దక్కలేదు. ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్న విజయ శాంతికి ఒక పవర్ ఫుల్ డైలాగ్‌తో పాటు, మరో పవర్ పుల్ షాట్ కూడా కట్ చేశారు. మరో ఇంపార్టెంట్ రోల్ ప్రకాష్‌రాజ్‌కీ డైలాగ్‌తో కూడిన స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్, అజయ్ తదితర ఇతర తారాగణం కూడా ఏదో ఒక షాట్‌లో కనిపించారు. కానీ హీరోయిన్‌ని ఎక్కడా చూపించలేదు దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్‌బాబును పక్కా మాస్ లుక్స్‌లో చూపించి చితక్కొట్టేశాడు. ఇంతవరకూ మహేష్‌ని అలా చూడలేదంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే, రష్మిక మండన్నా ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. ఏదో ఒక షాట్‌లో రష్మికను కూడా చొప్పించి ఉంటే బాగుండని భావిస్తున్నారు. సూపర్ స్టార్‌ని డామినేట్ చేసేలా అక్కడ విజయ శాంతి క్యారెక్టర్ ఉండడంతో, హీరోయిన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో రష్మిక పాత్రకు అంత సీను ఉండి ఉండదని అనుకుంటున్నారు.
అయితే, హీరోయిన్ క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ మరో స్పెషల్ టీజర్‌ని రిలీజ్ చేయనున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అందుకే హీరోయిన్ పాత్రను ఈ టీజర్‌లో సస్పెన్స్‌గా ఉంచారంటున్నారు. అతి త్వరలోనే ఆ టీజర్ కూడా రిలీజ్ కానుందట. అంటే, రష్మిక ఫ్యాన్స్‌కి అనిల్ రావిపూడి నుండి స్పెషల్ ట్రీట్ అన్న మాట.