గ్లామర్‌కి దూరంగా, పర్‌ఫామెన్స్‌కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా ఇకపై అలాంటి రూల్స్‌కి బ్రేకప్ చెప్పేసిందా.? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవల 'సరిలేరు..' సినిమా ప్రమోషన్స్‌లో అక్కడక్కడా కాస్త గ్లామర్ ప్రదర్శించిన రష్మిక, మెల్ల మెల్లగా డోస్ పెంచనుందట. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలన్నా, ఉన్న క్రేజ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాలన్నా గ్లామర్ తప్పనిసరి. అసలే అక్కడ రష్మికు పోటీగా ఉన్న పూజా హెగ్దే గ్లామర్‌లో టాప్ లెవల్‌లో ఉంది. అలాగే పర్‌ఫామెన్స్ కూడా ఇరగదీసేస్తోంది. ఆ పోటీని తట్టుకోవాలంటే రష్మిక కూడా గీత దాటక తప్పదనుకున్నదేమో బహుశా ఇకపై గ్లామరస్‌గా కనిపించేందుకు సిద్ధపడుతోందనే టాక్ వినిపిస్తోంది.
Waiting Mam 😍#Bheeshma #Bheeshma2ndSingle @iamRashmika @actor_nithiin pic.twitter.com/4vQTxqj4Bs
— Rashmika Mandanna™ (@RashmikaTFC) January 28, 2020
ప్రస్తుతం రష్మిక, నితిన్‌తో 'భీష్మ' చిత్రంలో నటిస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి ఓ సరికొత్త రొమాంటిక్ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో రష్మిక పొట్టి గౌను ధరించి హీరోతో ఓ రొమాంటిక్ యాంగిల్ ఇచ్చింది. ఇలాంటి రొమాంటిక్ యాంగిల్స్ సినిమాలో చాలా ఉన్నాయట. అలాగే ఇలాంటి చిట్టి పొట్టి కాస్ట్యూమ్స్ కూడా రష్మిక ఎక్కువగానే ధరించిందని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ఆ తర్వాత రష్మిక - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. సుకుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలోనూ రష్మిక గ్లామరస్ లుక్స్ ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్ ఇస్తాయంటున్నారు. అంటే, రష్మిక గ్లామర్ గీత దాటేసినట్లే మరి.