హీరోయిన్‌గా ఓ రేంజ్ స్టార్‌డమ్ దక్కించుకున్న ముద్దుగుమ్మలు తదుపరి ఆలోచనలు చేయడం చాలా సహజమే. అంటే ఓ పక్క హీరోయిన్స్‌గా రాణిస్తూనే, మరోపక్క అభిరుచి గల సినిమాలను నిర్మించడంలోనూ ఆసక్తి చూపుతారన్న మాట. ఇప్పటికే, ఆ దారిలో చాలా మంది ముద్దుగుమ్మలు బిజీగా ఉన్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే, ఇటీవలే సమంత నిర్మాతగా మారింది. ఇకపోతే, తాజాగా మరో ముద్దుగుమ్మ ఇదే బాటలో పయనించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆమె మరెవరో కాదు, రష్మికా మండన్నా. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రష్మిక సత్తా చాటుతున్న సంగతి వాస్తవమే. కానీ, రష్మిక కెరీర్ ఇంకా మొదటి దశలోనే ఉంది.
ఈ దశలో ఉండగానే ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ ఆలోచనలు చేస్తుందా.? ఏమో, రష్మికను తక్కువ అంచనా వేయడానికి లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక, ఇటీవల ఓ పోస్ట్ పెట్టింది. యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేలా ఉంది ఆ పోస్ట్. కొత్త కొత్త కథలు రాసేవారు, తమ తమ కథలను తనకు మెయిల్ ద్వారా పంపించాలనీ, నచ్చిన కథలను సినిమాలుగా తెరకెక్కించేందుకు ఓ టీమ్‌ని నియమించానని రష్మిక చెప్పుకొచ్చింది. అంటే, ఆయా కథలను రష్మిక సొంతంగానే నిర్మిస్తుందా.? రష్మిక నిర్మాతగా మారబోతోందా.? అనే మాటలు ప్రచారంలోకి వచ్చేశాయి. రష్మిక పోస్ట్‌లోని ఆంతర్యమేమిటో కానీ, జనానికి అర్ధమైన తీరిదేగా మరి.