రష్మిక,... ఒక్క సినిమాకే స్టార్ అయిపోయిన కథానాయికల్లో ఒకరు. `ఛలో` సినిమా అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది. ఆ తరవాత.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకుంది. హీరోయిన్ గా అద్భుతాలేం చేయకపోయినా.. తన కంటూ ఓ క్రేజ్ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడిపోయింది రష్మిక. రష్మిక పారితోషికం నిన్నా మొన్నటి వరకూ 1.5 కోట్ల లోపే.
ఇప్పుడు సడన్ గా 50 లక్షలు పెంచేసిందట. ట్విస్ట్ ఏమిటంటే 2 కోట్లు ఇస్తానన్నా ఇప్పుడు కథలు వినడం లేదు. తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, కొత్త కథలు వినే ఓపిక లేదని డైరెక్ట్ గా చెప్పేస్తోంది. తనేహీరోయిన్ గా కావాలంటే మరో ఆరు నెలలు ఆగాలి అంటూ షరతు పెడుతోందట. రష్మిక కావాలంటే.. ఆరునెలలు ఆగాల్సిందే. లేదంటే.. 2 కోట్లకు ఎంతో కొంత ముట్ట జెప్పాల్సిందే. కాల్షీట్లు ఖాళీలేవంటూనే వచ్చిన అడ్వాన్సల్లా.... తీసేసుకుంటోందట. ఇదేం స్ట్రాటజనో మరి..?!