దక్షిణాది హీరోయిన్లకు బాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. పూజా హెగ్డే, సమంత బాలీవుడ్ లో అవకాశాల్ని కొల్లగొడుతున్నారు. రష్మిక కూడా ఈ జాబితాలో చేరిపోయింది.
`పుష్ప`తో బాలీవుడ్ లోనూ రష్మిక పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్ సినిమా `గుడ్ బాయ్`లో రష్మిక కథానాయికగా ఆఫర్ అందుకొంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈలోగా రష్మికకు మరో ఆఫర్ వచ్చింది. త్వరలోనే టైగర్ ష్రాఫ్ సరసన నటించబోతోందని సమాచారం. ఇప్పటికే రష్మిక కథ వినేసిందని, ఈ ప్రాజెక్టులో నటించడానికి పచ్చ జెండా ఊపిందని సమాచారం. ఒక్కో తెలుగు సినిమా కోసం రష్మిక దాదాపు రూ.3 కోట్లు అందుకొంటోంది. అయితే బాలీవుడ్ లో ఇంత కంటే కాస్త తక్కువ పారితోషికమే ఇస్తారు. కాకపోతే... జాతీయ స్థాయి గుర్తింపు వస్తుంది. ఒక్క సినిమా హిట్టయితే.... అక్కడ కూడా నాలుగు నుంచి రూ.5 కోట్ల పారితోషికం అందుకోవచొచ్చు.
రష్మిక ప్లానింగ్ అదే. అందుకే తెలుగులో ఎంత బిజీగా ఉన్నా, బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేసుకుంటూ పోవాలని అనుకుంటోంది. అందుకే... టైగర్ ష్రాఫ్ తో సినిమాని ఒప్పుకొందని తెలుస్తోంది. ఈ బాలీవుడ్ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు వస్తాయి.