ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న కన్నడ కుట్టి రష్మికా మండన్నాకి సోషల్ మీడియాలోనూ పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రష్మికతో ఛాటింగ్ చేయడానికి ఫ్యాన్స్ తెగ ఉబలాటపడిపోతుంటారు. తమ మనసులో మెదిలే ప్రశ్నలకు ఈ ముద్దుగుమ్మ నుండి చిలిపి చిలిపి సమాధానాలు రాబడుతూ పండగ చేసుకుంటుంటారు. ఇకపోతే, అసలు వివరాల్లోకి వెళదాం.. రష్మిక నటించిన తమిళ సినిమా ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ లేకుంటే, ఈ పాటికే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. లాక్‌డౌన్ అనంతరం ఇమ్మీడియట్‌గా ఆ సినిమా ధియేటర్స్‌లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే, ఈ లోగా ఫలానా తమిళ హీరోతో రష్మిక సినిమా అట.. అంటూ గాసిప్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి. అఫ్‌కోర్స్.. గతంలోనూ రష్మికపై ఇలాంటి వార్తలు చాలానే గుప్పుమన్నాయనుకోండి. ఇళయదళపతి విజయ్‌తో రష్మిక అంటూ రకరకాల గాలి వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అవేమీ నిజం కావని తేలిపోయిందనుకోండి. ఇక రష్మిక గాలి వార్తల లిస్టులోకి తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కూడా చేరిపోయాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా రష్మిక, అజిత్‌కి బర్త్‌డే విషెస్ చెబుతూ, ‘అజిత్ గారూ మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని.. అయితే, మిమ్మల్ని నేను ఇంతవరకూ కలవలేదు. కానీ, మీ ఫ్యాన్స్ కారణంగా మిమ్మల్ని కలిసినట్లుగానే ఫీలవుతుంటాను..’ అంటూ ఓ బిస్కట్ వేసేసింది. ఈ బిస్కెట్‌కి అర్ధం తెలియనంత వెర్రి వాళ్లు కాదు మన ప్రేక్షకులు అని మా అభిప్రాయం. ఏమంటారు. అదండీ అసలు సంగతి, మాటల్లో తనను కొట్టేవాళ్లే లేరని మరోసారి ప్రూవ్ చేసుకుందీ తాజా ఎపిసోడ్‌తో మన రష్మిక .