ఒకప్పుడు చిన్న సినిమాలు అరుదుగా విజయాలు అందుకునేవి. ఇప్పుడు పెద్ద సినిమాలతో పోల్చితే చిన్న సినిమాలు సంచలన విజయాలు అందుకుంటూ, వసూళ్ళ పంట పండిస్తున్నాయి.
అందుకే తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. బడా నిర్మాతలు పెద్ద సినిమాలు తీయడం తగ్గించేసి, చిన్న సినిమాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్స్ వంటి సంస్థలూ చిన్న సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే లేటెస్ట్గా 'రథం' అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
హీరో, హీరోయిన్.. నాలుగు లిప్ కిస్ సీన్లు, ఇంకొన్ని ఇంటిమేట్ సీన్లు.. వీటికి తోడు మాస్ ఎలిమెంట్స్.. ఇదీ 'రథం' గురించి చెప్పుకోవాలంటే అన్నట్లుగా ట్రైలర్‌ని రూపొందించారు. అంతకు మించి సినిమాలో ఓ మంచి ఫీల్ కన్పిస్తోంది. ఓ యువకుడి పోరాటం గోచరిస్తోంది. కురుక్షేత్రంతో పోల్చేశాడు తాను చేస్తున్న పోరాటాన్ని ఇందులో హీరో. ట్రైలర్ కన్విన్సింగ్‌గా వుండటంతో 'రథం' ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
నటీనటుల్లో చాలామంది కొత్తవారే. హీరో చాలా కాన్ఫిడెంట్‌గా కన్పిస్తోంటే, హీరోయిన్ కూడా ఎట్రాక్టివ్‌గా వుంది. హీరో హీరోయిన్ల మధ్య లిప్ కిస్ సన్నివేశాల్ని ఇన్నోవేటివ్‌గా తెరకెక్కించారు. 'ఆ భంగిమలు' నిజంగానే కొత్తగా అన్పిస్తున్నాయి. 'ఆర్ఎక్స్ 100' తరహాలో ఈ సినిమా రా-లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తున్న దరిమిలా, ఆ స్థాయి విజయాన్ని ఈ 'రథం' కూడా అందుకుంటుందేమో వేచి చూడాలిక.