రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `క్రష్`. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్ల కథ ఇది. అంతా కొత్తవారే. ఈసారి అడల్ట్ కామెడీ జోనర్‌ని ఎంచుకున్నాడు రవిబాబు. టీజర్ కూడా విడుదల చేశాడు. అందులో ఎన్ని బూతులో. టిఫిన్లు, భోజనాలు, బఫే.. అంటూ యువతరం వాడే కోడ్ భాష మొత్తం వాడేశాడు. అమెరికా వెళ్లాలనుకన్న ముగ్గురు స్నేహితుల కథ ఇది. అమెరికా వెళ్లాలనుకుంటే బాడీలో ఏ పార్టు ఎందుకుందో, దాన్ని ఎలా వాడాలో టెస్ట్ చేసుకోవడం అత్యవసరమని, లేదంటే అమెరికా వెళ్లడం అనవసరమని ఓ స్నేహితుడు సలహా ఇస్తే.. ఇక రంగంలోకి దిగిపోతారు ఈ ముగ్గురూ. ఒకొక్కరూ ఒక్కో గాళ్ ఫ్రెండ్ ని వెదుక్కుని ప్రయోగాల్లో పడతారు.
ఊపుతూ కూర్చున్నారా?
ఏమైనా చేశారా?
ఫస్ట్ టైమ్ అమ్మాయిని చూసినప్పుడు టంగ్ మంది
సార్ టిఫిన్ చేశా.. అంటే హార్న్ కొట్టడం, బటన్ ప్రెస్ చేయడం
టంగ్ రాజా మా నాన్నకు కనపడకుండా అవీ ఇవీ అడ్డుపెట్టుకుని తిరిగేవాడ్ని
ఇలా సాగాయి డైలాగులు. రవిబాబు తీసిన షాట్స్ తీస్తుంటే - శృంగార మితిమీరిందనే అనిపిస్తోంది. మొత్తానికి.. కుర్రాళ్లని ఈ సినిమా ఆకర్షించేలానే ఉంది. మరి.. థియేటర్లలో విడుదల అవతుందో? లేదంటే ఓటీటీకి పరిమితం అవుతుందో చూడాలి.