బిగ్‌బాస్‌ నుండి ఇంకో 'మంచోడు' ఔట్‌.!

మరిన్ని వార్తలు

మంచోళ్లని బిగ్‌బాస్‌ ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండనివ్వడు అనే ప్రచారం హోరెత్తిపోతున్న వేళ 'మంచోడు ఆఫ్‌ ది బిగ్‌బాస్‌' గా పరిగణించబడుతున్న రవికృష్ణ ఈ వారం హౌస్‌ నుండి బయటికొచ్చేశాడు. శ్రీముఖి, వరుణ్‌, బాబా భాస్కర్‌, రవికృష్ణలు ఈ వారం ఎలిమినేషన్‌ లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే. వారిలో రవికృష్ణకే ఎడ్జ్‌ ఉందని ముందుగానే ఊహించినా, చివరికొచ్చేసరికి బాబా భాస్కర్‌ వైపు కూడా కొంచెం అనుమానపు గాలి మళ్లింది. కానీ, చివరికి అందరూ ఊహించినట్లే జరిగింది. రవికృష్ణ ఎలిమినేట్‌ అయ్యాడు.

 

గత వారం ఆల్రెడీ ఎలిమినేట్‌ అయిన ఆలీ వైల్డ్‌ కార్డ్‌ రీ ఎంట్రీ జరిగింది. అలీ, రవి మంచి స్నేహితులు. అలీ రాకతో హౌస్‌లో నవ్వుల పూలు విరబూశాయి. రీ ఎంట్రీలో అలీలో చాలా మార్పులు కనిపించాయి. గతంలో ఉన్న మాదిరి కాకుండా, కొంచెం కొత్తగా బిహేవ్‌ చేస్తున్నాడు. అంతకు ముందు తనకు హేటర్స్‌ అయిన మహేష్‌, రాహుల్‌ తదితరులు ఇప్పుడు అలీతో చాలా స్నేహంగా ఉంటున్నారు. ఇక దోస్తానా.. అనుకునే రవికృష్ణ పట్ల అలీ అంత ఎక్కువ అఫెక్షన్‌ చూపించినట్లు కనిపించలేదు.

 

ఏదో ఫార్మల్‌గా రెండు కన్నీటి బొట్లు రాల్చాడు రవికృష్ణ ఎలిమినేట్‌ అయినందుకు. ఇక గత 68 రోజులుగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న బిగ్‌బాస్‌ ప్రీ క్లైమాక్స్‌కి చేరింది. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. వచ్చే వారం బహుశా డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండొచ్చని హోస్ట్‌ నాగార్జున ఆల్రెడీ హింట్‌ ఇచ్చాడు. మరి ఈ వారం నామినేషన్‌లో ఉండేదెవరో తెలియాలంటే తాజా ఎపిసోడ్‌ కోసం స్టే ట్యూన్డ్‌ బిగ్‌బాస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS