ప్రముఖ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తనకు కథ ఇస్తానని మోసం చేశాడని, అందుకు గానూ 13.5 లక్షల పారితోషికం 2017లోనే ఇచ్చేసినా, ఇప్పటి వరకూ కథ ఇవ్వలేదని, డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని కోన వెంకట్‌పై జెమినీ ఎఫ్ ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు జూబ్లీ హిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కోనపై చీటింగ్ కేసు నమోదైంది.
ఐపీసీ 406. 420 సెక్షన్ల కింద కోన వెంకట్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు అనే వార్త మీడియా లో హల చల్ చేస్తుంది. కోన చేతిలో చాలా అడ్వాన్సులు ఉన్నాయి. కొంతమంది కోన కథ ఇస్తాడన్న భరోసాతో ఎంతకాలమైనా ఎదురుచూస్తుంటారు. ఇంకొంతమంది ఇలా రివర్స్ అవుతుంటారు. వీరిద్దరి మధ్య కథకు సంబంధించిన వివాదమే ఉందా, లేదంటే వేరే కారణాల వల్ల ప్రసాద్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడా అన్నది ఆసక్తికరం.
అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ...ఇది కేవలం అపార్ధం చేసుకుని ప్రచురించిన వార్త అని.. జెమిని ఎఫ్ ఎక్స్..ఆర్ వి ప్రసాద్ ఖండించారు.
టాలీవుడ్‌లో పేరొందిన రచయితల్లో కోన వెంకట్ ఒకరు. త్రివిక్రమ్ తరవాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకున్న రచయితగా కోనకు పేరుంది. తను నిర్మాత కూడా. బాలీవుడ్‌లోనూ సినిమాలు తీశారు. ప్రస్తుతం అనుష్కతో `సైలెన్స్`ని రూపొందిస్తున్నారు.