కెరీర్ లో కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ స్క్రీన్ పైకి తన మార్కు ఎనర్జీ తో వచ్చేశాడు మాస్ మహారాజ రవితేజ.
అయితే వస్తూనే ఒక అంధుడి పాత్రని ఒప్పుకొని అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది, ముఖ్యంగా ఆ పాత్రలో రవితేజ పలికించిన అభినయం అందరిని మెప్పించింది.
ఇదిలాఉంటే, నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ- ఈ చిత్రం నాకు బాగా సంతృప్తినిచ్చింది, రాజా ది గ్రేట్ కచ్చితంగా గ్రేట్ చిత్రం అవుతుంది అన్న నమ్మకం నాకుంది. చివరగా ఒక్కటే చెబుతున్నా, ఈ నెల 18న మీరంతా ధియేటర్ కి వచ్చి నాకు ఒకసారి వినిపించండి.
అయితే సాధారణంగా రవితేజ ఎక్కువగా మాట్లాడడం మనం చూడం, అలాంటిది రవితేజ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఈ సినిమా పైన అంచనాలు మరింత పెరిగాయి.