మాస్‌ రాజా రవితేజా తక్కువేం కాదుగా.!

మరిన్ని వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు పలు సినిమాలు తమ తమ అప్‌డేట్స్‌ని అందించడంలో ఉత్సాహం చూపించాయి. ఎన్టీఆర్‌ 'అరవింద సమేత' టీజర్‌ విడుదల కాగా, క్రిష్‌ - బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 'మణికర్ణిక' ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అలాగే మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ తాజా చిత్రం 'అంతరిక్షం' టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అదే కోవలో తానేం తక్కువ కాదంటూ మాస్‌ రాజా రవితేజ కూడా తన కొత్త చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశాడు. 

పోస్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పోస్టర్‌పై కింగ్‌, క్వీన్‌ బొమ్మలతో పాటు, ఒక గోల్డెన్‌ ఉంగరం ఉంది. ఈ మూడింటికి కనెక్షన్‌ అన్నట్లుగా ట్రయాంగిల్‌లో డ్రా చేసి ఉంది. ఆ బొమ్మల దగ్గర రిటర్న్‌ గిఫ్ట్‌ అని రాసుంది. కాన్సెప్ట్‌ మరీ డీప్‌గా అర్ధం కాకపోయినా, పోస్టర్‌లోని ఈ బ్రైట్‌నెస్‌ చూస్తుంటే, సినిమా ఖచ్చితంగా హిట్‌ కొట్టేలానే అనిపిస్తోంది. శీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శీను వైట్ల - రవితేజ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. 

అలాగే ఇటీవల 'రంగస్థలం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రీ ఎంట్రీలో 'రాజా ది గ్రేట్‌' సినిమాతో హిట్‌ కొట్టి సత్తా చాటిన రవితేజ 'టచ్‌ చేసి చూడు'తో నిరాశపరిచినా 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'తో మరో హిట్‌కి రెడీ అవుతున్నాడనిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజది ట్రిపుల్‌ రోల్‌ అని తెలుస్తోంది. 

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొంది ఇప్పుడు తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయిన బెల్లీ బేబ్‌ ఇలియానా ఈ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అదీ సంగతి.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS