సరికొత్త టెక్నాలజీతో వస్తున్న రవితేజ

By iQlikMovies - June 02, 2018 - 16:17 PM IST

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగనుంది.

ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారట. అదేంటంటే ఈ చిత్రాన్ని 8K కెమెరాతో చిత్రీకరించనున్నారట, ఇక దీనికోసం ప్రత్యేక లెన్సులు కూడా వాడనున్నారట. ఈ టెక్నాలజీ వాడడం వల్ల విజువల్స్ క్లారిటీ ఇంకా పెరగనుంది అని తెలుస్తుంది.

ఇదిలావుండగా రవితేజ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయనున్నాడు, అమెరికాలో 50రోజుల పాటు భారీ షెడ్యూల్ ని ఈ చిత్రం కోసం ప్లాన్ చేశారు. ఇక రవితేజ, శ్రీను వైట్ల తమ కెరీర్స్ లో సరైన హిట్ లేక అవస్థలు పడుతున్నారు. అందుకే ఈ చిత్రం హిట్ అవ్వడం ఈ ఇద్దరికి చాలా అవసరం. 

చూడాలి.. అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఈ ఇద్దరికి కావాల్సిన హిట్ ఇస్తుందా లేదా అని...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS