హీరో వరుణ్ కి యాక్సిడెంట్ అయింది

By iQlikMovies - June 02, 2018 - 16:05 PM IST

మరిన్ని వార్తలు

హీరో వరుణ్ ధావన్ కి సినిమా షూటింగ్ లో ఒక స్టంట్ చేస్తుండగా గాయపడినట్టు తెలుస్తున్నది.

అందుతున్న వివరాల ప్రకారం, కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతున్న “కళంక్” చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇక ఆ షూటింగ్ లో భాగంగా వరుణ్ ధావన్ ఒక స్టంట్ సన్నివేశంలో నటిస్తుండగా ముందుగా అనుకున్న స్టంట్ కాకుండా వేరేలా చేయగా గాయమైనట్టుగా తెలిసింది.

దీనితో వెంటనే షూటింగ్ నిలిపేశారు. ఇక వరుణ్ అయిన గాయం చిన్నదే కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విషయాన్నీ కళంక్ యూనిట్ కూడా దృవీకరించింది. ఒక్క రోజు విశ్రాంతి తరువాత వరుణ్ మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటాడు అని సమాచారం.

ఈ కళంక్ చిత్రంలో సంజయ్ దత్, మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, అర్జున్ కపూర్ తదితరులు నటిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS